వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేందర్ సింగ్

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేందర్ సింగ్ మరోసారి నోరు జారాడు. దేశంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను శ్రీ రాముడు కూడా ఆపలేడని వివాదాస్పదంగా వ్యాఖ్యానించాడు. గతంలోనూ ప్రభుత్వ అధికారులను వేశ్యలతో పోల్చిన సురేందర్ సింగ్.. ఉన్నావ్‌ రేప్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యేకి మద్దతుగా నిలిచి విమర్శలు మూటగట్టుకున్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ దేశంలో అఘాయిత్యాలను నివారించాలంటే అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించాడు. 

‘శ్రీ రాముడు వచ్చినా.. దేశంలో అత్యాచారాలను నివారించలేడు. అవి ఇప్పుడు సమాజంలో సహజంగా భాగమైపోయాయి. ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నా. సమాజంలో అందరూ బాధ్యతగా వ్యవహరించగలిగితేనే అఘాయిత్యాలను నివారించగలం’ అని సురేందర్ సింగ్ సూచించాడు. 

వేశ్యలు డబ్బులు తీసుకుని డ్యాన్స్‌ చేసి మనల్ని ఆనందపరుస్తారు. కానీ.. ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకున్నా.. పని చేయడం లేదు. వారి కంటే వేశ్యలే నయమని గతంలో సురేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

0 Comments Write your comment

    1. Loading...