సినీ విశ్లేషకుడు, దర్శకుడు కత్తిమహేశ్‌పై బహిష్కరణ వేటు పడింది

సినీ విశ్లేషకుడు, దర్శకుడు కత్తిమహేశ్‌పై బహిష్కరణ వేటు పడింది. కత్తి మహేశ్‌పై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు. పోలీసుల అనుమతి లేకుండా కత్తి మహేశ్ హైదరాబాద్ రావొద్దని పోలీసులు ఆదేశాలు జారీచేశారు.

ఈ విషయాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. కత్తి మహేశ్ గత నెల 29న ఓ టీవీ చానెల్‌లో చర్చా కార్యక్రమంలో భాగంగా రాముడు, సీతలనుద్దేశించి అభ్యంతరకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశారని, అతనిపై కిరణ్ ఆనంద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు కత్తిమహేశ్‌ను గంటపాటు విచారించి నోటీసులు ఇచ్చి పంపించిన విషయం తెలిసిందే.

0 Comments Write your comment

    1. Loading...