సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పాదయాత్రకు పిలుపునిచ్చిన విషయం విదితమే

సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పాదయాత్రకు పిలుపునిచ్చిన విషయం విదితమే. కత్తి మహేశ్ గత నెల 29న ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాముడు, సీతను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

కత్తి మహేశ్ వ్యాఖ్యలపై పరిపూర్ణానంద స్వామి తీవ్రంగా స్పందించారు. బషీర్‌బాగ్‌లోని భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. ధర్మాగ్రహ యాత్రను మొదలుపెట్టాలని భావించిన పరిపూర్ణానంద స్వామిని రాచకొండ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన నివాసం పోలీసులు భారీగా మోహరించారు. పాదయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో.. పరిపూర్ణానంద స్వామి నివాసానికి వేలాది సంఖ్యలో హిందువులు తరలివస్తున్నారు.

ఇక కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ వేటు పడిన విషయం విదితమే. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరికాసేపట్లో కత్తి మహేశ్ నగర బహిష్కరణ వేటుపై డీజీపీ మహేందర్‌రెడ్డి అధికారికంగా ప్రకటించనున్నారు.

0 Comments Write your comment

    1. Loading...