నటి శ్రీ రెడ్డి తన తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ పవన్.

ఈ మధ్యకాలంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి శ్రీ రెడ్డి తన తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ పవన్.. ఆమె వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసిన చానెళ్లపై విమర్శలు చేశారు. 

అయితే ఆ వ్యాఖ్యలను ఓ చానెల్ మరీ ఎక్కువగా ప్రసారం చేసిందని ఆగ్రహించిన పవన్ దాని యజమానిని ఉద్దేశిస్తూ అనుచిత ట్వీట్లు చేశారు. దీంతో ఆ పత్రిక, టీవీ చెనెల్ యజమాని పవన్‌కు తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. తనకు క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులకు పవన్ స్పందించకపోవడంతో ఆయనపై పరువు నష్టం దావా వేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అకారణంగా కామెంట్ చేయడమే కాకుండా సంస్థ పరువుకు భంగం కలిగించారని పవన్ కళ్యాణ్‌పై సదరు పది కోట్లకు పరువునష్టం దావా వేశారు.

దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు బుధవారం (జులై 4) సమన్లు జారీచేసింది. ఓ పత్రిక యజమాని దాఖలు చేసిన పరువు నష్టం కేసులో జులై 24న స్వయంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ కోర్టుకు హాజరుకావాలని తెలిపింది. సివిల్ కోర్టు 3వ అదనపు జడ్జి ఈ సమన్లు జారీ చేశారు.

0 Comments Write your comment

    1. Loading...