ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు

ముందస్తు ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్‌కి ముందస్తు ఎన్నికలు వస్తే సిద్ధమేనన్న ఆయన, అసెంబ్లీకి మాత్రం షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. శుక్రవారం (జులై 6) గుంటూరు జిల్లా టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం జమిలి ఎన్నికలపై ఆలోచనలు చేస్తోందని.. కానీ అసెంబ్లీకి మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఒకవేళ కేంద్రం అడిగితే షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేయనున్నట్లు తెలిపారు. రాజ్యాంగపరంగా ఇబ్బందులుంటే ఎదుర్కొందామని, అవసరమైతే న్యాయ నిపుణులతో మాట్లాడదామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
మంత్రివర్గ విస్తరణపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌లోకి ముస్లిం మైనారిటీని తీసుకోవడంపై ముఖ్యనేతలతో చర్చించిన బాబు మొదట్నుంచీ టీడీపీలో ఉన్న వ్యక్తికే అవకాశమివ్వనున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి వచ్చిన ముస్లిం నేతలను కేబినెట్‌లోకి తీసుకుంటే చిక్కులొస్తాయంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు ముస్లిం మైనారిటీల సభ కంటే ముందే కేబినెట్‌ విస్తరణ చేపట్టనున్నట్లు సంకేతాలిచ్చారు

0 Comments Write your comment

    1. Loading...