రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు

త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్న రేణు దేశాయ్ 
ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ట్రోల్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటంతో ఆమె సీరియస్ అయ్యారు. నాకు లెక్చర్లు ఇవ్వడం మానుకోవాలని ఫ్యాన్స్‌కు సూచించిన ఆమె.. నాకు సలహాలు ఇవ్వకుండా మీ వాళ్లను కంట్రోల్ చేసుకోండంటూ ఆమె తీవ్రంగా మందలించారు. మీరు క్రియేట్ చేస్తున్న నెగటివిటీని తట్టుకోవడానికి నేనేం తప్పు చేశానని ఆమె ప్రశ్నించారు.

రేణు దేశాయ్‌ ఎంగేజ్‌మెంట్ అయిపోయాక పవన్ కల్యాణ్ ఆమెకు విషెస్ చెబుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కొందరు ఫ్యాన్స్ రేణు రెండో పెళ్లి పట్ల సానుకూలంగా స్పందించగా.. మరి కొందరు మాత్రం ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. దీంతో తన ఎంగేజ్‌మెంట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రేణు.. దానికి కామెంట్లను బ్లాక్ చేసింది.

విడాకుల విషయంలో ఇన్నేళ్లపాటు నేను నోరు మెదపలేదు. దీనికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నా పట్ల కృతజ్ఞతతో ఉండాలి. నేను గనుక నోరు విప్పి మా విడాకుల గురించి నిజాలు చెబితే మీకు గర్వభంగం అవుతుంద’ని రేణు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్లీజ్ నాకు సలహాలు ఇవ్వడం మానుకోండి. ఇప్పటి నుంచైనా నన్ను టార్గెట్‌ చేయడం మానండని రేణు కోరారు. ఏడుపు గొట్టు కామెంట్లు ఆపండంటూ పవన్ ఫ్యాన్స్‌కు ఆమె చురకలు అంటించారు.

ట్విట్టర్లో నెగెటివిటీ ఎక్కువ ఉందని వాపోయిన ఆమె.. పవన్ ఫ్యాన్స్‌ను పరోక్షంగా విమర్శించడంతోపాటు తన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేశారు.

0 Comments Write your comment

    1. Loading...