కేంద్రం సహకరించకుండా రాజధాని అభివృద్ధి వైపు కన్నెత్తి చూడకపోయినా..

రాజధాని నిర్మాణంలో  కేంద్రం సహకరించకుండా  రాజధాని అభివృద్ధి వైపు కన్నెత్తి చూడకపోయినా.. సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో రాజధాని అమరావతి నగరం వేగంగా నిర్మాణం జరుగుతోంది. రాజధాని గ్రామం రాయపూడికి ఆనుకొని తూర్పు భాగంలో, ఐఏఎస్‌ ఇళ్ల నిర్మాణాలు దగ్గర్లో, గవర్నమెంటు కాప్లెక్స్‌కు అతి సమీపంలో ఐకాన్‌ టవర్ల నిర్మాణాలు 13 అంతస్థులతో జరగనున్నాయి.

దీనికోసం సీఆర్డీయే ఐదెకరాల భూమిని కేటాయించింది. ఇందుకు పదికోట్లు ఎన్ఆర్‌టీ సంస్థ చెల్లించినట్టు తెలిసింది. ఈ నెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10-11 గంటల మధ్యలో శంకుస్థాపన చేయనున్నారు. పూర్తిగా వాణిజ్య సముదాయంగా ఉండే టవర్లు 120 దేశాల్లో ఉన్న ఎన్ఆర్‌లు వేల కోట్ల పెట్టుబడులు పెట్టి కంపెనీలు స్థాపించనున్నారు. దీంతో వేలమందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని సీఆర్డీయే భావిస్తోంది.
 
ప్రవాసాంధ్రుల ఉనికికి చిహ్నంగా రాజధానిలో ఈ టవర్ల నిర్మాణం ఎంతో ప్రతిష్ఠాత్మంగా జరగనుంది. ఎనిమిది లక్షల చదరపు అడుగులలో నిర్మిత ప్రాంతం ఉంటుందని సీఆర్డీయే ఇజనీరింగ్‌ అధికారులు సూచిస్తున్నారు. అందులో వంద కంపెనీలకు పైగా ఏర్పాటు చేసుకోవటానికి వీలుంటుంది. శంకుస్థాపన చేసే ప్రాంతంలో 40 దేశాల జాతీయ జెండాలను ఆవిష్కరించారు

0 Comments Write your comment

    1. Loading...